Monday, December 23, 2024

పెళ్లి చేయడంలేదని తండ్రి, పినతండ్రిని చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

AP Constable Murdered in Nandyal

నిజామాబాద్: పెళ్లి చేయడం లేదని మతిస్థిమితం లేని యువకుడు తండ్రి, బాబాయ్ ని హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్రల అబ్బయ్య రెండో కుమారుడు సతీష్(28)కు దుబాయ్ లో ఉన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనుకావడంతో మానసిక సమస్యలు వచ్చాయి. అతడు సోదరుడు దుబాయ్ లో  ఉండడంతో వెంటనే అతడిని నిజామాబాద్ కు పంపించారు. తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను వేధించేవాడు. తాను ఓ యువతిని చూసుకొని వచ్చానని, ఒకరికొకరు నచ్చామని 14న ఇంటికి వస్తారని చెప్పాడు. శుక్రవారం తెల్లవారుజామున అబ్బయ్య వాకిలి ఊడ్చుతుండగా సతీష్ పెళ్లి విషయంలో గొడవపడ్డాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తండ్రిపై పారతో దాడి చేశాడు… అడ్డుగా వచ్చిన బాబాయ్ ని కూడా పారతో దాడి చేయడంతో ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పార తీసుకొని ప్రాణం పోయేవరకు దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News