- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ బేగంపేట పరిధిలోని పాటిగడ్డలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలతో ఓ కుమారుడు తండ్రిని హతమర్చాడు. మృతుడిని అబ్రహం లింకన్ గా గుర్తించారు. కొడుకు కిరణ్ కన్నతండ్రిని కొడవలితో నరికి చంపాడు. ఆస్తి విషయంలో కొంతకాలంగా తండ్రి, కుమారుడి మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -