Tuesday, May 13, 2025

కుమురంభీంలో దారుణం.. తండ్రిని కొట్టి హత్య చేసిన కొడుకు

- Advertisement -
- Advertisement -

Son Killed father in komaram bheem district

కుమ్రం భీం: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం కర్జీ గ్రామంలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ కుమారుడు కన్నతండ్రిని కొట్టి హత్య చేశాడు. మృతుడిని మధుకర్ గా గుర్తించారు. కుమారుడు తిరుమలేష్ మద్యానికి బానిసై డబ్బుల కోసం తండ్రిని హింసించేవాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి, కొడుకు మధ్య డబ్బుల కోసం వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన తిరుమలేష్ తండ్రిని కొట్టి చంపేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News