- Advertisement -
మేడ్చల్: పక్షవాతంతో బాధపడుతున్న తండ్రిని కుమారుడు కొట్టి చంపిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత ఐదు సంవత్సరాల నుంచి సత్యనారాయణ అనే వ్యక్తి పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి కుమారుడు సురేష్ మద్యం తాగొచ్చి తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తండ్రిపై సురేష్ కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
- Advertisement -