Sunday, December 22, 2024

పెంచుకున్నందుకు పీక కోశాడు….

- Advertisement -
- Advertisement -

Son killed mother and father in Nizamabad

మన తెలంగాణ/ నిజామాబాద్ న్యూస్: కన్న కూమారుడు చనిపోవడంతో దగ్గర బంధువుల అబ్బాయిని వృద్ధ దంపతులు దత్తత తీసుకున్నారు. ఓ నేరగాడి మాయలో పడి వృద్ధ దంపతులను దత్తత కుమారుడు హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆలూరు మండల కేంద్రం గంగారామ్(70), గంగామణి(65) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ఉన్న ఒక్కగాను ఒక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో 2016లో బంధువుల నుంచి ఓ అబ్బాయిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. అబ్బాయి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉండే నేరస్థుడితో బాలుడికి పరిచయం ఏర్పడింది. ఈ నేరస్థుడి మాయలోపడిన బాలుడి ఆ వృద్ధ దంపతులను చీరతో ఇద్దరు గొంతులను బిగించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో నగల కోసమే వృద్ధ దంపతులను హత్య చేశారని తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News