Thursday, November 21, 2024

అప్పు ఇచ్చినందుకు అమ్మ ప్రాణం తీశాడు…..

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: అప్పు ఇచ్చి అడిగినందుకు తల్లిని హత్య చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బసవ పార్వతమ్మ (65) అనే వృద్ధురాలు ఇద్దరు కుమారులు వెంకటరత్నం నాయుడు, శ్రీనివాసరావులు ఉన్నారు. శ్రీనివాసరావు జామాయిల్ వ్యాపారం చేయడంతో నష్టం వచ్చింది. భద్రాచలానికి చెందిన రమేష్ వద్ద అప్పు తీసుకొని నష్టాన్ని పూడ్చాడు. కొన్ని రోజుల అప్పించిన డబ్బులు ఇవ్వాలని రమేష్ కోరడంతో తన తల్లిని పలుమార్లు అడిగాడు. పార్వతమ్మ తన వాటాకు వచ్చిన భవనాన్ని అమ్మడంతో తొమ్మిది లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు తన కుమారుడు శ్రీనివాసరావుకు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బును తీసుకెళ్లి రమేష్‌కు ఇచ్చాడు.

మూడు నెలల వరకు తల్లికి వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. కానీ అసలు అడిగితే ఇవ్వకపోవడంతో పల్లుమార్లు తన కుమారుడిని తల్లి మందలించింది. తన తల్లి కూడా తన బాధను అర్థం చేసుకోవడం లేదని పలుమార్లు బాధపడ్డాడు. 2020 డిసెంబర్ 23 న అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఆమె ఇంట్లోకి వెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి దిద్దులు, అప్పుకు సంబంధించిన ప్రంశరీ నోటు తీసుకొని వెళ్లిపోయాడు. బంగారాన్ని బాత్రూమ్‌లో దాచి పెట్టి నిద్రలోనికి జారుకున్నాడు. పార్వతమ్మ చనిపోయినట్టు సమాచారం రావడంతో శ్రీనివాసరావు అక్కడికి వెళ్లాడు. బిపి, షుగర్ ఎక్కువ కావడంతో తల్లి చనిపోయిందని అందరిని నమ్మించాడు. పెద్ద కుమారుడు వెంకటరత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టమ్ చేసిన డాక్టర్ ను సహజ మరణమని రాయలని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు కోసమే తన తల్లిని చంపానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News