Sunday, April 27, 2025

బోధన్ లో తల్లిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

Son Killed Mother in Nizamabad

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిని తనుయుడు గంగాప్రసాద్ (19) చంపేశాడు. మద్యానికి డబ్బుల కోసం రాత్రి తల్లి గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలిని మంజుల(40)గా గుర్తించారు. మంజుల కుటుంబసభ్యులు తొలుత సాధారణ మరణంగా భావించారు. మంజుల నోట్లో రక్తం చూసి బంధువులు కుమారుడిని నిలదీశాడు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపినట్టు కొడుకు ఒప్పుకున్నాడు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గంగాప్రసాద్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News