లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పబ్‌జీ ఆడొద్దని వారించిన కన్నతల్లినే కాల్చి చంపాడో బాలుడు. తల్లి మృతదేహంతో రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. హత్యను కప్పిపుచ్చడానికి పోలీసులకు కట్టుకధలు చెప్పాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు విషయం ఒప్పుకున్నాడు. సాధన అనే మహిళ తన 16 ఏళ్ల కొడుకు, 12 ఏళ్ల కుమార్తెతో కలిసి లక్నోలోని పీజీఐ ప్రాంతంలో ఉంటోంది. ఆమె భర్త కోల్‌కతాలో ఆర్మీలో పనిచేస్తున్నాడు. సాధన కుమారుడు పబ్‌జీ గేమ్‌కు బానిసై పోవడంతో పలుమార్లు తల్లి హెచ్చరించింది. దీనిపై కోపం పెంచుకున్న కొడుకు శనివారం రాత్రి నిద్రలో ఉన్న తల్లిని తుపాకీతో కాల్చి చంపాడు. మూడు రోజుల పాటు తల్లిశవాన్ని ఇంట్లోనే ఉంచాడు. మంగళవారం రాత్రి తన తండ్రికి ఫోన్ చేసి ఇంట్లో రిపేర్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ అమ్మను చంపేశాడని చెప్పాడు. ఇదే విధంగా పోలీసులకు చెప్పాడు. అయితే ఆమె కూతురు మాత్రం అసలు విషయం చెప్పేసింది. ఎవరికైనా నిజం చెబితే తనను కూడా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పింది. పోలీసుల విచారణంలో బాలుడు నిజం ఒప్పుకున్నాడు.
Son killed Mother says not playing Pubg in UP