Wednesday, January 29, 2025

తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు అరెస్టు

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: సుల్తానాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పూసాల గ్రామంలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేశామని సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జగదీష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు తీగల రాజేశం గతంలో 2002 సంవత్సరంలో కాచాపూర్ గ్రామంలో తీగల కనకయ్య అనే వ్యక్తిని చంపి అట్టి కేసులో జైలుకు వెళ్లి రావడం జరిగిందని సిఐ జగదీష్ తెలిపారు. ఈ హత్య సంఘటన తర్వాత కుటుంబ సభ్యులందరు కాచాపూర్ నుండి సుల్తానాబాద్ మండలంలోని పూసాల గ్రామానికి వెళ్లి అక్కడే జీవిస్తున్నారు. నిందితుడు జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉండేవాడు.

తండ్రి నిందితుడిని ఎప్పుడు ఖాళీగా ఉంటున్నావో అని ఏదో ఒక పనులు చేసుకోవాలని బూతులు తిట్టేవాడు. దాంతో నిందితుడు గతంలో కూడా ఒకసారి తండ్రిపై దాడి చేయగా కాలు విరిగిందని సిఐ తెలిపారు. ఈ క్రమంలో తేదీ ఈ నెల 8వ తేదీన మృతుడు తీగల నరసయ్య పొలంలో పండిన పంట వడ్లు ఐకెపీ సెంటర్‌లో ఉన్నాయని వాటిని ఆరబెట్టుటకు వెళుతున్నానని వడ్లు ఆరబెట్టేందుకు రమ్మన్నాడు. నిందితున్ని కూడా రమ్మని చెప్పగా కొంత సమయం తరువాత ఐకెపీ సెంటర్ వద్దకు వెళ్లిన నిందితుడిని వడ్లు ఆరబెట్టడానికి సహాయం చేయమని చెప్పడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగింది. నిందితుడు కోపంతో తన తండ్రి ఎప్పుడు తనని తిడుతున్నాడని తనని చంపేస్తే గాని బాధ పోదని భావించి అక్కడ ఉన్న చిన్న ఇటుకతో తలపై కొట్టగా తలకి రక్తగాయమై కింద పడిపోయాడు.

తరువాత పక్కనున్న పెద్ద బండరాయి తీసుకొని మృతుడు నరసయ్య తలపై కొట్టగా తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. చుట్టు పక్కల ఉన్న వారు గట్టిగా అరవడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ రాత్రిపూట పూసాల గ్రామ శివారులోని వారి పొలం గుడిసె వద్ద ఉన్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఈ రోజు నిందితుడిని గుడిసె వద్ద పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఎస్‌ఐ విజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News