- Advertisement -
కాసరగాడ్ ( కేరళ ) : నిత్యం మొబైల్ ఫోన్‌కు బానిసై గడిపే కొడుకును వారించినందుకు కొడుకు దాడితో తల్లి తీవ్ర గాయాల పాలై చివరికి ప్రాణాలు కోల్పోయింది. కన్నూర్ జిల్లా కణిచిరకు చెందిన 63 ఏళ్ల రుక్మిణి తన కొడుకు సుజిత్ నిత్యం మొబైల్ ఫోనే ప్రపంచంలా బానిసై గడపడంతో గట్టిగా వారించింది. దీంతో కొడుకు సుజిత్ తల్లిపై విరుచుకుపడి ఆమె తలను బలంగా గోడకు ఢీకొట్టించడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. గత వారం రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రుక్మిణి శనివారం మృతి చెందింది. ఈ నేరానికి పాల్పడిన రుక్మిణి కొడుకు సుజిత్‌ను పోలీస్‌లు అరెస్టు చేశారు. నిరంతరం మొబైల్ ఫోన్ వాడుతున్నావని నిలదీసినందుకు తల్లిపై దాడి చేసినట్టు సుజిత్ విచారణలో ఒప్పుకున్నాడు. మానసికంగా స్థిమితం లేని సుజిత్‌ను కొజికోడ్ లోని కుతిరవట్టం మానసిక ఆస్పత్రిలో చేర్చారు.
- Advertisement -