Tuesday, January 21, 2025

అర్ధరాత్రి ఎక్సర్ సైజు చేస్తున్నావని అడిగినందుకు తల్లిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని సుల్తాన్ బజారులో అర్ధరాత్రి ఎక్సర్‌సైజు ఎందుకు చేస్తున్నావని కుమారుడిని తల్లి మందలించడంతో కోపంతో ఆమెను చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాపమ్మ తన కుటుంబంతో కలిసి సుల్తాన్ బజారులో నివసిస్తోంది. పాపమ్మ కుమారుడు సుధీర్ ఆదివారం అర్ధరాత్రి లేచి వ్యాయామం చేస్తుండగా తల్లి అతడిని మందలించింది. కోపంతో ఊగిపోయిన అతడు రాడ్‌తో ఆమెను కొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయింది. అడ్డువచ్చిన చెల్లెను కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుధీర్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News