Sunday, January 19, 2025

పాట్నా సాహిబ్ నుంచి మాజీ స్పీకర్ కుమారుడు పోటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీజేపీకి కంచుకోటగా భావిస్తున్న బీహార్ లోని పాట్నా సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్సూల్ అవిజిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అవిజిత్ కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ వెల్లడించారు. . బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీకి నిలబడ్డారు. బీజేపీకి గట్టి పట్టున్న పాట్నాసాహిబ్ స్థానం నుంచి 2009, 2014లో 55 శాతం ఓటు బాగస్వామ్యంతో బీజేపీ విజయం సాధించగా, 2019 నాటికి ఓటు భాగస్వామ్యం బీజేపీకి 60 శాతం వరకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News