Saturday, November 23, 2024

రిస్క్ అనిపించినా ‘సన్ ఆఫ్ ఇండియా’ చేశాం

- Advertisement -
- Advertisement -

డాక్టర్ మోహన్‌బాబు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డా.మోహన్ బాబు మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

రిస్క్ ఉన్నా చేశాము

ఒక్క డిఫరెంట్ కథను దర్శకుడు డైమండ్ బాబు చెప్పగా నాకు నచ్చింది. అయితే ఇందులో రిస్క్ వున్నా కూడా ఈ సినిమా తీద్దామని చేశాము. మా గురువు దాసరి నారాయణరావు, శ్యామ్ బెనగల్ వంటి వారు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు తీశారు. నేను కూడా అలా చేద్దామని ఈ సినిమా తీయడం జరిగింది.
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న వారి కోసం
ఈ సినిమా కథ విషయానికి వస్తే… చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చేయకు అనే ఒక మంచి వ్యక్తి తన భార్య, పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక రాజకీయ నాయకుడి వల్ల తన జీవితం ఎలా నాశనం అయ్యింది, చేయని తప్పుకి ఏం శిక్ష అనుభవించాడు, జైల్లో ఉంటూ బాగా చదువుకొని తన లాంటి తప్పు చేయని వారు దేశంలో ఎంతమంది ఉంటారని థీసెస్ చేసి అటువంటి వారి కోసం అతను ఎం చేశాడు? అనేది ఈ సినిమాలో చూపించాం. మన దేశంలో ఎన్నో వేల మంది చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు. వారి పిల్లలు పరిస్థితి ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం.

కొత్త కాన్సెప్ట్‌తో

ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ టీవీ చానల్స్, ప్రవేట్ హాస్పిటల్స్… ఇలా ఎన్నో వున్నాయి అవన్నీ ఉండగా ప్రైవేట్ జైలు ఎందుకు ఉండకూడదు అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమా ద్వారా తీసుకురావడం జరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న వేలాదిమంది ఖైదీల డిమాండ్ ఏమిటనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

యూత్ కోసం

నేటి తరం వారు కులాలుకు అతీతంగా పని చేయాలని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సినిమాలో యూత్‌కు కావాల్సిన అంశాలు పెట్టడం జరిగింది. కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ పెట్టాము.

నా పాత్ర డిఫరెంట్‌గా

నేను ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు చేశాను, కానీ ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. నా డైలాగులు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.

అందుకే డైరెక్షన్ చేయడాన్ని విరమించుకున్నా

నేను డైరెక్షన్ చేయడానికి రెండు కథలు సిద్ధంగా వున్నా కూడా నా టీం టైంకు రాకపోతే నాకున్న కోపం వారిని ఇబ్బంది పెడుతుందని దర్శకత్వం వహించడాన్ని విరమించుకున్నాను. ప్రస్తుతం నేను ఒక పుస్తకం రాస్తున్నాను. అందులో అన్నీ నిజాలు రాస్తున్నా, ఈ పుస్తకానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. తర్వాత మంచి లక్ష్మీ సినిమా ఒకటి ఓటిటికి సిద్ధంగాఉంది. ఆ తరువాత విష్ణుతో ఒక సినిమా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News