Wednesday, January 22, 2025

అజయ్ దేవగన్ తో నటిస్తున్న మృణాల్ ఠాకూర్‌

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో..
సీతారామంతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆతర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ బ్యూటీ ఇటు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా దూసుకెళ్తోంది. తాజాగా ఈ బ్యూటీకి ఓ లక్కీ ఆఫర్ వచ్చింది. 2013 లో రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మర్యాద రామన్న రీమేక్ గా బాలీవుడ్‌లో సన్ ఆఫ్ సర్దార్ సినిమా వచ్చింది. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు. అయితే రాజమౌళికి ఈ సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు. ఇక సన్ ఆఫ్ సర్దార్ 2లో మృణాల్ ఠాకూర్‌కి ఛాన్స్ వచ్చింది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ఈ బ్యూటీ ఎంతో హ్యాపీగా ఉంది. సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో ఆమెది కూడా మంచి పాత్ర అని.. సినిమాలో ఆమె సీ న్స్ కూడా హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News