- Advertisement -
రాంచీ: 65 ఏళ్ల తండ్రిని ఓ కొడుకు హత్య చేసేందుకు యత్నించిన అమానుష సంఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది. భోలా అనే వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి.. కాళ్ల, చేతులు కట్టేసి విచక్షణ రహితంగా దాడిచేశాడు కొడుకు. అనంతరం స్నేహితుల సాయంతో భోలాను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పై పడేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
son sews father lips with rope in jharkhand
- Advertisement -