Sunday, December 22, 2024

ఆస్తి కోసం తండ్రిని చంపేందుకు ప్రయత్నించిన కొడుకు

- Advertisement -
- Advertisement -

Son tried to kill father for property in Annamayya district

అమరావతి: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ దుర్మార్గపు కొడుకు కన్నతండ్రిని చంపాలని చూశాడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రి వెనుక నుంచి కారుతో ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడిని లక్ష్మీ ప్రసాద్ రెడ్డిగా గుర్తించారు. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ అని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. పెద్ద కొడుకు చనిపోవడంతో చిన్న కొడుకు ఆస్తి కోసం పట్టుబట్టడంతో సగం ఆస్తి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండవ భార్య తమ్ముడి దగ్గర ఉంటున్నాడు. సగం ఆస్తి తనకు రాసిస్తాడేమో అనే అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News