Thursday, January 23, 2025

తండ్రిని చంపి ముక్కలుగా నరికిన కొడుకు

- Advertisement -
- Advertisement -

 

బరౌపూర్ (పశ్చిమబెంగాల్ ): శ్రద్ధా శరీరాన్ని ఎలా ముక్కలుముక్కలు చేసి అనేక ప్రాంతాల్లో విసిరిపారేశారో అలాంటి సంఘటనే పశ్చిమబెంగాల్‌లో జరిగింది. మాజీ నేవీ ఉద్యోగి అయిన తండ్రిని కొడుకు చంపి శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికి వాటిని తల్లి సాయంతో పారవేసిన సంఘటన వెలుగు లోకి వచ్చింది. పశ్చిమబెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా లోని బరౌపూర్ ప్రాంతంలో ఇండియన్ నేవీలో కానిస్టేబుల్‌గా పనిచేసి రిటైర్ అయిన 55 ఏళ్ల ఉజ్వల్ చక్రవర్తి కుటుంబంతో ఉంటున్నాడు. 2020లో రిటైరైన చక్రవర్తి మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఆయన కుమారుడు జోయ్ చక్రవర్తి పాలిటెక్నిక్ కార్పెంటరీ స్టూడెంట్. తండ్రీ కొడుకులు గొడవపడడంతో నవంబర్ 12న కొడుకు కోపంతో తండ్రిని ఉరికి వేలాడదీసి హత్య చేశాడు. శవాన్ని తల్లీ కొడుకులిద్దరూ బాత్‌రూమ్ లోకి శవాన్ని తీసుకెళ్లారు.

తన కార్పెంటరీ క్లాస్ కిట్‌బ్యాగ్‌లో ఉండే రంపం తీసి కొడుకు తన తండ్రి శవాన్ని ఆరు ముక్కలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ భాగాలను పరిసర ప్రాంతాల్లో పారేశారు. ఆరు చుట్టల్లో ఆ శరీర భాగాలను చుట్టి సైకిలుపై 500 మీటర్ల దూరంలో ఖాస్ మల్లిక్, డెహిమేదాన్ మల్ల ఏరియాల్లో పారేశాడని పోలీసులు చెప్పారు. చెత్త డంప్‌లో చక్రవర్తి రెండు కాళ్లు దొరికాయని , డెహిమేదాన్ మల్లా చెరువు లోంచి తల, కడుపు బయటపడ్డాయని పోలీసు ఆఫీసర్ తెలిపారు. చేతులు ఇతర అవయవాల గురించి వెతుకుతున్నారు.

నవంబర్ 15 తెల్లవారు జామున చక్రవర్తి కనిపించడం లేదని తల్లీ కొడుకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే వారి వివరణలో తేడా కనిపించి వారిని అదుపు లోకి తీసుకోగా హత్య బయటపడిందని పోలీసులు చెప్పారు. పరీక్ష ఫీజు కోసం రూ. 3000 కావాలని కొడుకు అడగ్గా చక్రవర్తి ఇవ్వలేదని, దాంతో గొడవ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చక్రవర్తి తన కొడుకును తోసివేయగా, కొడుకు కూడా తోయడంతో తండ్రి తల కుర్చీకి తగిలి స్పృహ కోల్పోయినట్టు , తరువాత తండ్రిని ఉరికి వేలాడ దీసినట్టు పోలీసులు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News