Thursday, December 26, 2024

ఆస్తి వివాదం.. తల్లిని కడతేర్చిన తనయుడు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, జనగామరూరల్ : ఎన్నో పూజలు చేసి నోములు నోచి కన్న కొడుకు మృత్యువులా మారి కన్నతల్లిని కడతేర్చిన ఘటన జనగామ మండలం మరిగడి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. కూరాకుల కన్నప్ప (33) ఆస్తి విషయమై కన్నతల్లి కూరాకుల రమణమ్మతో జరిగిన వివాదంలో గురువారం ఉదయం 8గంటల సమయంలో తల్లి రమణమ్మను కత్తితో గొంతు కోసి మెడ వేరు చేసి హత్యచేశాడు. రమణమ్మ భర్త కూరాకుల రాజయ్య 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు. రాజయ్య పేరు మీద గ్రామంలో ఉన్న పదెకరాల వ్యవసాయ భూమి అతడు చనిపోయిన తరువాత భార్య రమణమ్మ పేరు మీద మార్చుకుంది. వీరి సంతానం కన్నప్ప, కూతురు లావణ్య ఈ 10 ఎకరాల భూమి విషయంలో ఈ మధ్య వివాదం చోటు చేసుకుంది. కూతురు లావణ్య, ఓర్సు సాయి (భద్రాచలం) అనే వడ్డరి కులస్తుడిని ప్రేమ వివాహం చేసుకుంది.

రమణమ్మ కొడుకు కన్నప్పకు తెలియకుండా కూతురు లావణ్యకు నాలుగెకరాల భూమి పట్టా చేసింది. ఈ విషయం తెలిసిన కన్నప్ప తరుచూ తల్లి రమణమ్మతో గొడవ పడుతున్నారు. ఈ విషయంలో ఈనెల 5న కన్నప్ప తల్లి రమణమ్మను గోడకేసి కొట్టగా తలకు గాయాలయ్యాయి. ఇట్టి విషయంలో జనగామ పీఎస్‌లో 58/2023యూ/ఎస్324ఐపీఎస్ క్రింద కన్నప్పపై కేసు నమోదైంది. అనంతరం పోలీసులు తనను తీసుకొని గ్రామానికి వెళ్లగా పెద్ద మనుష్యులతో మాట్లాడుకుంటామని చెప్పి ఇతడు ఆత్మహత్యాయత్నం చేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు.. హాస్పిటల్ నుంచి డిస్‌చార్జ్ అయి తల్లి రమణమ్మతో గొడవపడి ఇంట్లో ఉన్న కత్తితో గొంతు కోసి తల, మొండం వేరుచేసి హత్య చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి శవ పంచనామ నిర్వహించారు. నిందితుడు కన్నప్పను పోలీసులు విచారణ జరిపి రిమాండ్‌కు తరలించారు. అనుకోని ఈ సంఘటన పట్ల స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News