Friday, January 31, 2025

బతికుండగానే కన్నతండ్రిని కాలువలో పడేసిన కొడుకు

- Advertisement -
- Advertisement -

పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బతికుండగానే కన్నతండ్రిని కాలువలో పడేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం నూజెండ్లకు చెందిన గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్య(85)ను కారులో తీసుకొచ్చి బద్రుపాలెం వంతెనపై నుంచి సాగర్ కాలువలో పడేశాడు. ఈ ఘటన చూసిన గ్రామస్థులు వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమందించారు. పోస్టుమార్టం నిమిత్తం కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ గ్రామీణ సిఐ ప్రభాకర్, ఈపూరు ఎస్‌ఐ ఉమా మహేశ్వర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News