Saturday, November 23, 2024

స్టార్ పిల్లలకైతే మాత్రం ఛాన్సులు పోవా?

- Advertisement -
- Advertisement -

Sonakshi Sinha

ముంబయి: స్టార్ పిల్లలకైతే మాత్రం సినిమాలు దక్కకపోవడం, తీసేయడం అంటూ ఉండదు అని బయటి వాళ్లు చెప్పుకునే విషయాన్ని హిందీ నటి సోనాక్షి సిన్హా ఖండించింది. ఛాన్సులు దొరకనంత మాత్రాన స్టార్ పిల్లలు గోలగోల చేయరంది. సినిమావాళ్లతో బంధం ఉన్నవాళ్లకే ఛాన్సులు దక్కుతాయనే విషయాన్ని ఆమె తూర్పారబట్టింది.

పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వూలో సోనాక్షి సిన్హా ‘నేను కూడా చాలా సినిమా ఛాన్సులు మిస్సయాను. అది పనిలో ఓ భాగం. ఏ స్టార్ సంతానానికి ఛాన్సు మిస్సుకాలేదన్నది చెత్త. ఛాన్సులు దక్కనంత మాత్రాన స్టార్ పిల్లలు భోరుమనరు. ఛాన్సు దొరకడం, దొరకకపోవడం అనేది అందరికీ జరుగుతుంది.

‘సరే, నా గురించి వదిలేయండి. మా నాన్న(శత్రుఘ్న సిన్హా) స్టార్ కిడ్‌యేమి కాదు. అనేక ప్రాజెక్టుల నుంచి ఆయనని కూడా తప్పించారు. ప్రతి నటుడికి ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి. అది పనిలో ఓ భాగం. ఎవరూ వినని కొత్త విషయమేమి కాదు. ఇట్ ఈజ్ ఏ పార్సల్ ఆఫ్ జాబ్, మీరు మీ జీవితంలో ముందుకు సాగక తప్పదు. కష్టపడి పనిచేస్తూ ముందుకు పోతుండాలి” అని కూడా ఆమె తెలిపారు.

సోనాక్షి సిన్హా 2010లో ‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మాసాంతానికి ఆమె దాదాపు 11 సంవత్సరాలు సినీరంగంలో పూర్తి చేసుకున్నారు. రౌడీ రాథోడ్, లుటేరా, రాజ్‌కుమార్, ఫోర్స్2, ఇత్తెఫాఖ్ వంటి సినిమాలలో ఆమె నటించారు. తాజాగా ఆమె ‘భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాలో నటించారు. త్వరలో ఆమె అమెజాన్ ప్రైమ్ సీరిస్ ద్వారా డిజిటల్ డెబును కూడా చేయనున్నారు. అందులో ఆమె ఓ పోలీసుగా నటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News