కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. “నాకు యాక్షన్ సినిమాలు చేయాలని వుండేది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ కథ చెప్పినపుడు చాల థ్రిల్ అనిపించింది. నాగార్జున ఈ ప్రాజెక్ట్‌లో వున్నారని తెలిసి హ్యాపీగా అనిపించింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తా. సినిమాలో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్‌తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్‌తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలననే నమ్మకం నాకు కలిగింది. నాగార్జునతో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున కింగ్ అఫ్ రోమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే ‘ది ఘోస్ట్’ యాక్షన్ థ్రిల్లర్. నాగార్జునతో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని వుంది. ప్రవీణ్ సత్తార్ క్లియర్ విజన్ వున్న దర్శకుడు. ఆయన చాలా నీట్ గా హోమ్ వర్క్ చేసుకుంటారు. దీంతో నటీనటుల పని ఈజీ అవుతుంది. నాకు ఇందులో రెండు మెయిన్ యాక్షన్ బ్లాక్స్ వున్నాయి. ‘ది ఘోస్ట్’ పూర్తి యాక్షన్ పవర్‌ప్యాక్డ్ ఎంటర్‌టైనర్” అని అన్నారు.
Sonal Chauhan about ‘The Ghost’