- Advertisement -
పానాజీ: హర్యానా బిజెపి నాయకురాలు, నటి సోనాలి ఫోగట్(43) కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి తన ప్రభుత్వం అప్పగించనున్నదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు. ‘మేము కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించుకున్నాము. ఆమె కూతురు కూడా సిబిఐ విచారణను కోరుకుంది’ అని ఆయన వివరించారు. సోనాలి ఫోగట్ మరణం కేసును హత్య కేసుగా పరిగణిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. ఆగస్టు 22-23 మధ్య రాత్రి ఆమె అనూహ్యంగా మరణానికి గురయిందన్నారు. ఆమె పర్సనల్ అసిస్టెంట్ సుధీర్ సాంగ్వాన్, అతడి సహచరుడు సుఖ్వీందర్ సింగ్ కలిసి ఆమెకు డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి మరీ చంపారన్నది ఆరోపణ. ప్రస్తుతం ఆ నిందితులిద్దరూ పోలీసు కస్టడీలోనే ఉన్నారు.
- Advertisement -