Monday, December 23, 2024

అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చామని నేరాంగీకారం

- Advertisement -
- Advertisement -

Sonali Phogat murder case

హిసార్ : నటి, బీజేపీ నాయకురాలు సొనాలీ ఫోగెట్ హత్య కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల విలువైన ఆమె ఆస్తిని సొంతం చేసుకునేందుకు అధిక మోతాదులో మాదకద్రవ్యాలు ఇచ్చినట్టు కేసులో ప్రధాన నిందితుడు, ఫోగట్ వ్యక్తిగత సహాయకుడు (పిఎ) సుధీర్ సాంగ్వాన్ అంగీకరించాడు. నేరం చేసినట్టు సాంగ్వాన్ ఒప్పుకున్నాడని గోవా పోలీసుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోనాలి ఫోగట్‌కు మాదక ద్రవ్యాలు ఇచ్చేందుకు సుఖ్విందర్ సహాయం తీసుకున్నట్టు కూడా సాంగ్వాన్ అంగీకరించారు. గోవా పోలీసుల కస్టడీలో ఉన్న సాంగ్వాన్ ఈ విషయాలు ఒప్పుకున్నాడు. విచారణలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు హిసార్ లోని ఫోగట్ నివాసం లో గోవా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నేరం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కోర్టులో అడ్డం తిరుగుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫోగట్ హత్య కేసులో అరెస్టయిన సాంగ్వాన్, సుఖ్వీందర్‌లకు సంబంధించిన బలమైన మరిన్ని సాక్షాలను గోవా పోలీసులు సేకరిస్తున్నారు.

ఎరుపు డైరీలు స్వాధీనం
గోవా పోలీసులు శనివారం ఫోగట్ హిసార్ ఫామ్‌హౌస్ నుంచి ఎరుపురంగులో ఉన్న డైరీలను స్వాధీనం చేసుకున్నారు. సుధీర్ సాంగ్వాన్ ద్వారా ఫోగట్ ఇచ్చిన సొమ్ముకు సంబంధించిన వివరాలు ఆ డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్యానా, ఇతర రాష్ట్రాల్లో తాను ఖర్చు చేసిన సొమ్ము వివరాలు కూడా అందులో ఫోగట్ రాసుకున్నారని సమాచారం. దానితోపాటు ఫోగట్‌లో పనిచేసిన కొందరు రాజకీయనేతలు, అధికారుల పేర్లు, నెంబర్లు ఆ డైరీలో ఉన్నాయి. కాగా, సంత్‌నగర్ అపార్ట్‌మెంట్‌లో మరోసారి తనిఖీలు చేస్తామని పోలీసులు తనను కోరారని, మూడు గంటల సేపు తనిఖీలు చేశారని, సోనాలి ఫోగట్ తరచు వాడే ఎలక్ట్రానిక్ లాకర్ తెరుచుకోక పోవడంతో దానికి సీల్ వేశారని ఫోగట్ బంధువులు తెలిపారు. 42 ఏళ్ల ఫోగట్ ఆగస్టు 23న గోవాలో కన్నుమూశారు. తొలుత గుండెపోటుతో మరణించినట్టు పోలీసులు భావించినప్పటికీ పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు హత్యకేసును నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News