Wednesday, January 22, 2025

నటి సోనాలి ఫోగట్ ది హత్యే!

- Advertisement -
- Advertisement -

Sonali Phogat

న్యూఢిల్లీ: నటి, హర్యాణ బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ గోవాలో అనుమానస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఆమె అంతిమ యాత్రలో భౌతిక కాయం పాడేను ఆమె కూతురు మోసింది. ఆమె భౌతిక కాయానికి బిజెపి పతాకం చుట్టారు. ఆమె అంతిమ యాత్రలో అనేకులు పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే పోలీసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆమె మామూలుగా చనిపోలేదని, ఆమెను చంపారని తేలింది. ఆమె శరీరంపై అనేక గాయాలు కూడా ఉన్నాయని తెలిసింది. పోలీసులు రెస్టారెంట్ సిసిటివి ఫుటేజ్, నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుని విచారణ జరిపారు. రెస్టారెంట్‌లో పార్టీ జరిగేప్పుడు ఆమెకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారని గోవా పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆమె మరణానికి ఆమె ఇద్దరు స్నేహితులు సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ కారణమని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారిద్దరిని ప్రస్తుతం అరెస్టు చేశారు. ఆమెను సుధీర్ సంగ్వాన్ చంపాడని ఆమె బావ అమన్ పూనియా ఆరోపిస్తున్నారు. అతడు ఆమెను ఇదివరకే బలాత్కరించి, బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నాడని పేర్కొన్నారు. కాగా గోవా పోలీసులు గురువారం ఆమె హత్యకు గురైనట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కొందరు బిజెపి నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. “ఆమె మరణం నాకు వ్యక్తిగతంగా పూడ్చుకోలేని లోటు…ఆమె కుటుంబం కోరుకుంటే సిబిఐ విచారణ జరిపించాల్సిందే’ అని హర్యాణ బిజెపి ఎంఎల్‌ఏ కుల్దీప్ బిష్ణోయ్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News