Sunday, January 19, 2025

40-75 హెచ్‌పి శ్రేణిలో సోనాలికా సరికొత్త టైగర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో దిగ్గజ ట్రాక్టర్ తయారీ సంస్థ అయిన సోనాలికా ట్రాక్టర్ 40-75 హెచ్‌పిలో ‘టైగర్’ను ఆవిష్కరించింది. 40-75 హెచ్‌పిలో 10 కొత్త టైగర్ ట్రాక్టర్‌లను సరికొత్తగా విడుదల చేయడం ద్వారా దేశీయ రైతులకు పూర్తిగా జీరో కాంప్రమైజ్ ట్రాక్టర్ శ్రేణిని అందిస్తోంది. కంపెనీ 5 కొత్త శక్తివంతమైన ఇంకా ఇంధన సామర్థ్యం గల ఇంజన్‌లు, 5 కొత్త మల్టీ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లు, 3 కొత్త 5జి హైడ్రాలిక్స్‌లను అందిస్తోంది. యూరప్‌లో రూపొందించిన ట్రాక్టర్ శ్రేణిలో సరికొత్త సాంకేతికత ఉంది. కొత్తగా విడుదల చేసిన 10 కొత్త టైగర్ ట్రాక్టర్‌లలో హెవీ డ్యూటీ మైలేజ్ (హెచ్‌డిఎం+) ఇంజన్‌లు కలిగిన 6 ట్రాక్టర్లు ఉన్నాయి-. ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ మాట్లాడుతూ 4075 హెచ్‌పిలో 10 కొత్త అధునాతన టైగర్ ట్రాక్టర్‌లను విడుదల చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News