- Advertisement -
టోక్యో: ఒలింపిక్ రెజ్లింగ్లో భారత యువ రెజ్లర్ సోనమ్ మాలిక్ పోరాడి ఓడింది. మంగళవారం జరిగిన మహిళల 62 కిలోల విభాగంలో సోనమ్ చివరి వరకు పోరాడినా ఫలి తం లేకుండా పోయింది. మంగోలియా రెజ్లర్ బొలొర్తుయా తో హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్ పోటీలో 19 ఏళ్ల సోన మ్ 23 తేడాతో ఓడిపోయింది. ఆరంభంలో సోనమ్ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. అద్భుత ఆటను కనబరిచి న సోనమ్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే కీలక సమయంలో ప్రత్యర్థి పుంజుకుంది. ఇదే సమయంలో సోన మ్ ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకునన మంగోలియా ఆర్చర్ స్కోరును 22తో సమం చేసింది. ఇక చివరి 35 సెకన్లలో ప్రత్యర్థి ఒక పాయింట్ సాధించి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. మరోవైపు చివరి వరకు సర్వం ఒడ్డి పోరాడిన సోనమ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది.
- Advertisement -