Tuesday, January 21, 2025

తల్లి కాబోతున్న సోనమ్

- Advertisement -
- Advertisement -

Sonam kapoor pregnant

 

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తల్లికాబోతోంది. మరికొన్ని నెలల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా సోనమ్ కపూర్ బేబి బంప్ ఫోటోలతో తెలియజేసింది. ఆమె తన భర్త ఆనంద్ అహుజా ఒడిలో పడుకొని ఉన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో సోనమ్ నలుపు రంగు స్కిన్ టైట్ దుస్తుల్లో గర్భిణిగా దర్శనమిచ్చింది. ఇన్నాళ్లు మీడియా కంట పడకుండా..ఎక్కడా విషయం బయటపడకుండా సీక్రెట్‌గా ఉంచిన సోనమ్ అసలు విషయాన్ని చెప్పేసింది. దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ దంపతులకి శుభాకాంక్షలు చెబుతున్నారు. పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News