Monday, December 23, 2024

సోండి కులాన్ని ఒబిసిలో చేర్చాలి : డాక్టర్ లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : సోండి, శిష్ట కరణం కులాలను ఒబిసి జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సాంకేతిక సమస్యలు లేకుండా ప్రతిపాదనను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారని బిజెపి జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సొండి కుల సంక్షేమ సభలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

సోండి కులస్తులను ఓబిసిలో చేర్చాలని కోరుతున్నా.. పట్టించుకోలేదు. 29 కులాలు దశాబ్దాలుగా జాబితాలో చేర్చేందుకు పెండింగ్ పెట్టారు. ఎన్‌సిబిసి చైర్మన్ అయ్యాక ఆహిర్ ఈ ప్రతిపాదనలపై సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక పరమైన అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా వచ్చాక 26  బిసి కులాలను తొలగించారని వెల్లడించారు. సోండి, శిష్ట కరణం కులాలను బిసి జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సోండి కులస్తులు, బిజెపి నేతలు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News