Monday, December 23, 2024

బీజింగ్ ఒలింపిక్స్‌లో సోనియా, రాహుల్‌లు మమ్మల్ని కలవలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2008 బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా చైనా సందర్శించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గంధీ, రాహుల్ గాంధీలు భారతీయ క్రీడాకారులను కలవడానికి బదులు చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలను కలిశారని ఒలింపిక్స్ రజతపతక విజేత, బిజెపి ఎంపి రాజ్యవర్ధన్ రాథోడ్ ఆరోపించారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాథోడ్ మాట్లాడారు.

ఈ ఇద్దరినీ దేశద్రోహం నేరం కింద శిక్షించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.2008 ఒలింపిక్స్‌లో జరిగిన ఘటనను రాథోడ్ గుర్తు చేసుకుంటూ ‘2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నేను ఉన్నాను. మమ్మల్ని కలుసుకోవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారని అధికారులు మాకు చెప్పారు. అయితే వారు మ్మల్ని కలవడానికి రాలేదు. వాళ్లు చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలను కలిశారు’ అని రాథోడ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపేదని ఆయన ఆరోపిస్తూ సోనియా గాంధీ, రాహుల్‌లను దేశద్రోహం నేరం కింద శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘ ఒక సైనికుడు గనుక ఇదే పని చేస్తే దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు. వీళ్లు అప్పుడు దేశాన్ని తెరవెనుకనుంచి పాలించే వాళ్లు. వారిని దేశద్రోహం కింద శిక్షించాలి’ అని రాథోడ్ అన్నారు. 2004లో జరిగిన ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రైఫిల్ షూటింగ్‌లో రజత పతకాన్ని సాధించిన రాజ్యవర్ధన్ రాథోడ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News