Wednesday, January 22, 2025

ఊమెన్ చాందీ భౌతికకాయానికి సోనియా, రాహుల్ నివాళి..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ భౌతికకాయానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నివాళులర్పించారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని ఊమెన్ చాందీ నివాసానికి వెళ్లిన సోనియా, రాహుల్ లు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారితోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఊమెన్ చాందీకి నివాళులర్పించారు.

కాగా, గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతున్న ఊమెన్ చాందీ(80) ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని బెర్లిన్స్ చారిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004-2006, 2011-2016 కాలంలో ఆయన రెండు సార్లు కేరళ సిఎంగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News