Sunday, January 19, 2025

విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా..

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi About Social Media in Democracy

ముఖచిత్రం మారుస్తోన్న ఫేస్‌బుక్
విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా
ఎన్నికలు, ప్రజాస్వామ్యం హైజాక్
అధికార పార్టీకే కొమ్ముతో సొమ్ము
భావజాలంపై దాడితో అరాచకం
లోక్‌సభలో సోనియా ఘాటు ప్రసంగం
నియంత్రణ లేకుంటే పెనుముప్పే
న్యూఢిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో క్రమపద్ధతిలో వ్యూహాత్మకంగా ప్రపంచ సామాజిక మాధ్యమం జోక్యం చేసుకొంటోంది. వ్యవస్థను ప్రభావితం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. దీనికి ప్రభుత్వం అంతం పలకాల్సి ఉందని, లేకపోతే ఇది ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలను కావాలనే దురుద్ధేశపూరితంగా వాడుకుంటున్నారు. దీనితో దేశ ప్రజాస్వామ్య హరణం జరుగుతోందని సోనియా బుధవారం లోక్‌సభలో జీరో అవర్ దశలో తెలిపారు. సోషల్ మీడియా ఇక్కడి ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల వ్యవస్థను హ్యాక్ చేస్తోందని, ఇది చొరబాటుతో కూడిన ప్రాబల్యపు చర్య అవుతోందని చెప్పారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి గ్లోబల్ కంపెనీలను కొన్ని శక్తులు విరివిగా వాడుకుంటున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పార్టీలు, వారి అనుకూల పరోక్ష వ్యక్తులు తమ వాదనను బలోపేతం చేసేందుకు వాడుకుంటున్నాయని విమర్శించారు. గ్లోబల్ మీడియా కంపెనీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఈ విషయం ప్రజల దృష్టికి వచ్చింది. ఈ మీడియా అన్ని రాజకీయ పార్టీలకు సమాన రీతిలో ప్రాధాన్యత నివ్వకుండా, కొన్ని అభిప్రాయాలను నాటుకుపొయ్యేలా చేసేలా వ్యవహరిస్తున్నాయని సోనియా తెలిపారు. ఇది చివరికి ప్రజాస్వామ్యంపై దాడికి దారితీస్తోంది. కీలక వ్యవస్థలను ప్రభావితం చేసేలా మారుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె అల్ జజీరా, రిపోర్టర్స్ కలెక్టివ్‌లలో వచ్చిన వార్తలను ప్రస్తావించారు.

ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే తక్కువ రేట్ల ఈ మీడియా బిజెపికి యాడ్ రేట్లకు దిగుతోందని ఈ వార్తలలో ఉందని చెప్పారు. ప్రముఖ కార్పొరేట్లకు, అధికారంలో ఉన్న పార్టీకి, ఈ గ్లోబల్ మీడియాకు మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం దాని వల్ల జరిగే దుష్పలితాలు కన్పిస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియా అన్ని రాజకీయ పార్టీలకు తగు సమాన అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అది కన్పించడం లేదు. చీకటి ముసుగులో వ్యవహారాలు సాగుతున్నాయని ఆమె విమర్శించారు. సోషల్ మీడియా ప్రచారం తీవ్రస్థాయికి చేరుకొంటోంది. ఇందులోని భావజాలం క్రమేపీ అటు యువ, ఇటు పాత తరం వారి మనసులలో విద్వేషబీజాలను నాటుతోందని, భావోద్వేగ కారక తప్పుడు సమాచారంతో గతి తప్పుతున్నాయని అన్నారు. ప్రాబల్యపు రాజకీయ పార్టీల తరఫున పలు యాడ్స్‌తో లాభాలు దక్కించుకుంటున్నాయని తెలిపారు. సామాజిక సామరస్యం దెబ్బతినే స్థాయిలో రీతిలో ఈ మాధ్యమం తన పని కానిస్తోంది. ఇది భావజాలంపై జరుగుతోన్న దాడి. అరాచకం అవుతోంది. నిశ్చలంగా ఉండాల్సిన సామరస్యానికి ఈ ధోరణి గండికొడుతోంది. ఫేస్‌బుక్ ఇతర మాధ్యమాలు ప్రపంచస్థాయిలో ఎన్నికల రాజకీయాలపై జోక్యం చివరికి ప్రభావిత అంశానికి దారితీసి చేటును కల్గిస్తోంది. ప్రజాస్వామ్యానికి హాని కల్గుతోందని అన్నారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలలో ఈ పరిణామం ఉంది. పక్షపాత రాజకీయాల దశ కూడా దాటింది. ఇప్పటికైనా మనం ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవల్సి ఉంది. అధికారంలో ఎవరు ఉన్నారనేది ముఖ్యం కాదు. ప్రజాస్యామ్య పరిరక్షణ కీలకమన్నారు.

Sonia Gandhi About Social Media in Democracy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News