Friday, December 20, 2024

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi admitted in Hospital

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్థానికంగా చికిత్సకు ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ తదనంతర సమస్యలతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని, పరిశీలనలో ఉంచారని పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇక్కడి గంగారామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం త్వరితగతిన కుదుటపడాలని ఆకాంక్షిస్తోన్న పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఈ నెల 2వ తేదీనే సోనియా కరోనా వైరస్‌కు గురి అయ్యారు. ఓ వైపు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణ జరుగుతూ ఉండగా, దీనికి హాజరయ్యేందుకు కొవిడ్ కారణంగా ఆమె గడువు కోరారు. ముందు నిర్ణయించిన దాని ప్రకారం ఆమె ఈ నెల 8న ఇడి ఎదుట హాజరు కావల్సి ఉంది. అయితే ఇప్పుడు తమ విచారణకు ఈ నెల 23న హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లు వెలువరించారు.

Sonia Gandhi admitted in Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News