Monday, December 23, 2024

బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బ్రాంకైటిస్ కారణంగా ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. 76 ఏళ్ల ఆమె పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె గురువారం ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు.

“జ్వరం కారణంగా” చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అరుప్ బసు,  అతని బృందం పర్యవేక్షణలో గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు సర్ గంగా రామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ ఛైర్మన్ డిఎస్. రాణా తెలిపారు.”సోనియా గాంధీ పరిశీలనలో ఉన్నారు . ఆమె పరిస్థితి నిలకడగా ఉంది” అని ఆసుపత్రి బులెటిన్ తెలిపింది. ఈ ఏడాది ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. జనవరిలో సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News