Monday, December 23, 2024

కాంగ్రెస్ పార్టీ అధక్ష ఎన్నికల్లో ఓటేసిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీనియర్ లీడర్లు చిందబరం, జైరాం రమేశ్ తదితరులు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీ అధ్యక్ష బరిలో ఉన్న మల్లికార్జున ఖర్గే కూడా ఢిల్లీలో ఓటేశారు.

పోలింగ్ ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో 67 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల దాకా కొనసాగుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News