Saturday, December 21, 2024

మహిళా బిల్లు జాప్యంతో మగాళ్లకు ఆనందం

- Advertisement -
- Advertisement -

చెన్నై : మహిళా రిజర్వేషన్ల బిల్లు సత్వర అమలుకు ‘ఇండియా ’ కూటమి ఉద్యమిస్తుందని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇక్కడ తెలిపారు. శనివారం ఆమె ఇక్కడ డిఎంకె ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన మహిళల హక్కుల సదస్సును ఉద్ధేశించి ప్రసంగించారు. మహిళా బిల్లును పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. అయితే బిల్లు అమలులోకి వస్తేనే మహిళకు సరైన న్యాయం జరుగుతుందని, మహిళా సంబంధిత ఈ హక్కు కోసం ఇండియా కూటమి పోరు సల్పుతుందని సోనియా గాంధీ స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాకుండా ఇతర అన్ని పార్టీలు సంస్థల నిరంతర పట్టుదలతోనే మహిళా బిల్లు నెగ్గిందని సోనియా తెలిపారు.

అయితే ఇది కార్యాచరణ సాధించేది ఎప్పటికనేది తెలియదని, ఫలితం సుదూరంగా ఉందని అందరికీ తెలుసునని వివరించారు. మహిళా బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుంది? ఏడాది పడుతుందా? రెండేళ్లు పడుతుందా? మూడేళ్లు దాటుతాయా? చెప్పలేమని తెలిపిన సోనియా, ఈ జాప్యంతో కొందరు మగవారికి సంతోషం కల్గుతుంది. కానీ మా మహిళలు ఈ ఆలస్యం పట్ల సంతోషంగా లేరన్నారు. అయితే కుంగిపోకుండా తాము మహిళా బిల్లు అమలుకు తమ పోరు సాగుతుందని సోనియా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News