సైన్యంలో చేరాలనుకునే ఆశావహులకు సోనియా గాంధీ లేఖ
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా, అహింసాయుతంగా పోరాడాలని సోనియా గాంధీ విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకాన్ని “దిశలేనిది” అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం పేర్కొన్నారు. దాని ఉపసంహరణకు తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత తమ డిమాండ్ల కోసం శాంతియుతంగా, అహింసాయుతంగా పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
“ప్రభుత్వం కొత్త సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రకటించడం దురదృష్టకరం, ఇది పూర్తిగా దిశలేనిది, మీ స్వరాన్ని విస్మరిస్తూ చేసింది” అని యువతను ఉద్దేశించి హిందీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె తెలిపారు. ఆర్మీలో లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్‌మెంట్‌లో “మూడేళ్ల జాప్యం”పై యువకుల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
“కాంగ్రెస్ మీకు పూర్తిగా అండగా నిలుస్తుంది, మీ ప్రయోజనాల కోసం , ఈ పథకాన్ని ఉపసంహరించుకోవడం కోసం పోరాడతానని హామీ ఇస్తుంది.” “నిజమైన దేశభక్తుల వలె, మేము సత్యం, అహింస, స్థితిస్థాపకత(రెసిలియన్స్) , శాంతి మార్గంలో మీ గొంతుకను పునరుద్ఘాటిస్తాం” అని ఆమె తన లేఖలో యువకులను ఉద్దేశించి అన్నారు.
#BreakingNews | Amid politics over #AgnipathScheme, Sonia Gandhi writes to army aspirants, 'With you in this struggle.' @_pallavighosh shares more details. @JournoKSSR brings #Exclusive ground report from #Bihar.
Join this broadcast with @Runjhunsharmas. pic.twitter.com/4xJCzwDZDz
— News18 (@CNNnews18) June 18, 2022