Wednesday, January 22, 2025

రెండున్నర గంటలపాటు సోనియా గాంధీని ప్రశ్నించిన ఈడి

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మంగళవారం కాంగ్రెస్ నేత సోనియాగాంధీని రెండున్నర గంటలపాటు ప్రశ్నించింది. ఆమె మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడి కార్యాలయం నుంచి వెలుపలికి వచ్చారు. తర్వాత ఆమె మధ్యాహ్నం 3.30 గంటలకు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటారని తెలిసింది. ఆమెను ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ప్రశ్నించారు. ఆమెనడిగిన మొత్తం 28 ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News