Wednesday, January 22, 2025

జి-23 నేతలతో సోనియా గాంధీ భేటీ

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi meets G-23 leaders

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోని అసమ్మతివాద నాయకులతో కూడిన జి-23లో ఒకరైన గులాం నబీ ఆజాద్‌తో ఇటీవల భేటీ అయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం తన నివాసంలో ఆ గ్రూపునకు చెందిన మరికొందరు నాయకులతో సమావేశమయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనాయకుడైన ఆనంద్ శర్మ, లోక్‌సభ ఎంపి మనీష్ తివారీతోసహా కొందరితో ఆమె చర్చలు జరిపారు. రానున్న రోజుల్లో జి-23కి చెందిన మరికొందరితో ఆమె భేటీ అయే అవకాశం ఉంది. కాగా..సోనియాతో సమావేశమైన తర్వాత ఆజాద్ తమ గ్రూపునకు చెందిన కొందరు నాయకులను కలుసుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం కూడా జి-23 నేతల నుంచి సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉందని, పార్టీని బలోపేతం చేయడానికి తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తోందని పపార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News