Thursday, January 23, 2025

ఏ బిల్లు హమారా హై

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్‌కు ఇన్నేళ్ల తరువాత మహిళా బిల్లు రావడం తమ పార్టీ ఘనత అని కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ పార్లమెంటరీ చీఫ్ సోనియా గాంధీ విజయసంకేతం తెలిపారు. మంగళవారం ఆమె పార్లమెంట్‌లోపలికి ప్రవేశిస్తూ బిల్లుకు తమ స్వాగతం అన్నారు. చాలాకాలంగా ఈ బిల్లు తమ డిమాండ్లలో ముఖ్యంగా ఉంటోందన్నారు. ఈ బిల్లు తమది, అప్నాహై అన్నారు. యుపిఎ హయాంలో బిల్లు తీసుకువచ్చారని, ఇది ఇప్పుడు తిరిగి తీసుకువస్తున్నారని దీనిని బట్టే ఈ బిల్లు ఎవరిదో అర్థం చేసుకోవల్సి ఉంటుందని అక్కడి విలేకరులకు చెప్పి పార్లమెంట్‌లోపలికి సోనియా వెళ్లారు.
కాంగ్రెస్ బేషరతు మద్దతు

రాహుల్ రాసిన పాత లేఖ వెలుగులోకి
మోడీ ప్రభుత్వం ఎప్పుడు మహిళా బిల్లును తెచ్చినా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందనే రాహుల్ పాత లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మంగళవారం లోక్‌సభ సమావేశాల దశలో ఈ లేఖను విశేషంగా సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చారు. 2018 నాటి ఈ లేఖను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ వెలువరించారు. ప్రధాని మోడీ తరచూ తాను మహిళా సాధికారికత విషయంలో మొక్కవోని యోధుడిని అని చెపుతూ ఉంటారని, దీనిని నిరూపించుకోవాలంటే ఆయన మహిళా బిల్లును రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టాల్సి ఉందని ఇందులో రాహుల్ తెలిపారు. మాటలను చేతలు చేయడం మోడీ వైఖరితో తేలుతుందని ఈ లేఖలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News