న్యూఢిల్లీ: వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వాల నమోదు కోసం మొట్టమొదటిసారి చేపట్టిన డిజిటల్ సభ్యత్వ ప్రక్రియలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన పేరును నమోదు చేసుకున్నారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారి డిజిటల్ పద్ధతిలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు డిజిటల్ పద్ధతిలో 2.6 కోట్ల మందికి పైగా సభ్యత్వాలను నమోదు చేసుకోగా మరో 3 కోట్ల మంది పేపర్ నమోదు విధానంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా, అన్ని స్థాయిలలో పార్టీ నాయకత్వాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని అనేక రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నాయకుల నుంచి వరుసగా డిమాండ్లు రావడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ప్రక్రియను చేపట్టింది. చాలా మంది నాయకులు పార్టీ ఎన్నికల ప్రక్రియ, బోగస్ సభ్యత్వాల గురించి గతంలో అనేక ఫిర్యాదులు చేయడంతో కాంగ్రెస్ నాయకత్వం సభ్యత్వాల నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను తయారుచేసి పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులోకి తెచ్చింది.
కాంగ్రెస్ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న సోనియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -