Monday, December 23, 2024

అగ్నిపథ్‌కు దిశానిర్దేశం లేదు

- Advertisement -
- Advertisement -

Sonia gandhi respond on Agnipath

నిరసనకారులకు అండగా కాంగ్రెస్
శాంతియుత పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహించండి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లేఖ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. అగ్నిపథ్‌కు ఒక దిశానిర్దేశం అంటూ లేదని, యువత గొంతుకను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఈ మేరకు శనివారంనాడు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. చాలా మంది మాజీ సైనికాధికారులు కూడా కొత్త పథకం గురించి ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని, దానికి కేంద్రం దగ్గర సమాధానం లేదన్నారు. నిరసనకారులు అహింసాయుత పద్ధతుల్లో నిరసన తెలియజేయాలని సోనియా పిలుపునిచ్చారు. ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ‘పథకానికి వ్యతిరేకంగా మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న వాగ్దానానికి భారత జాతీయ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది. నిజమైన దేశభక్తితో హింసకు తావులేకుండా సహనంతో మీ తరపున మా గొంతుకను వినిపిస్తాం. మీరూ అహింసా మార్గంలోనే నిరసనలు చేపట్టండి’ అని సోనియా తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News