న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కులగణన సర్వేకు తాను నూటికి నూరు శాతం మద్దతు ఇస్తానని, ఇది తమ పార్టీకి అత్యధిక ప్రాధాన్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా సోనియా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాధారణ జనభాగణనతోపాటు కులగణన నిర్వహించడమౌతుందని 2021లోనే హామీ ఇచ్చినట్టు సమావేశంలో కాంగ్రెస్ వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడమౌతుందని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడమౌతుందని హామీ ఇచ్చింది. మహిళల రిజర్వేషన మోడీ ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను తొలగించడమౌతుందని కాంగ్రెస్ పేర్కొంది. అలాగే ఈ రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం కోటా పరిమితిని చట్టం ద్వారా తొలగిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
జాతీయ స్థాయిలో కులగణనకే అధిక ప్రాధాన్యమిస్తాం : సోనియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -