Wednesday, January 22, 2025

ఇప్పుడే ఇడి ఎదుటకు రాలేను

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi sought more time to appear before ED

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి కోలుకునేందుకు మరిన్ని వారాలు పడుతుంది
ఇడికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు బుధవారం లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇడి ఎదుట హాజరయ్యేందుకు మరింత గడువు కోరారు. కరోనా సోకడంతో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అందులో పేర్కొన్నారు. ఈమేరకు కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జిగా నియమితులైన జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. ఈనెల 8న విచారణకు హాజరు కావాలని ఇడి మొదట సమన్లు జారీ చేయగా, జూన్ 2న సోనియాకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరడంతో గడువు కోరారు. దీంతో ఈనెల 23న హాజరు కావాలంటూ ఇడి మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే దీనికి ఒక రోజు ముందు సోనియా మరోసారి గడువు కోరుతూ ఇడికి లేఖ రాయడం విశేషం. రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. దీర్ఘకాలంగా కొవిడ్ చికిత్స తీసుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్న సోనియాకు విశ్రాంతి అవసరం అని, అప్పుడే ఇడి ఎదుట హాజరయ్యేందుకు ఆమె ఆరోగ్యం సహరించకపోవచ్చునని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News