- Advertisement -
న్యూఢిల్లీ: భారత నారీ శక్తి ఎంతో ఘనమైందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. బుధవారం లోక్ సభలో మహిళా బిల్లుపై చర్చ నేపథ్యంలో సోనియా గాంధీ మాట్లాడుతూ.. “మహిళా బిల్లు రాజీవ్ గాంధీ కల. కోటా అమల్లోకి వస్తేనే రాజీవ్ కల నిజమవుతుంది. మహిళా బిల్లును వెంటనే అమల్లోకి తేవాలి. స్త్రీ శక్తిని కొలవడం అసాధ్యం. మహిళా బిల్లును మొదటసారి ప్రవేశపెట్టింది మేమే. స్థానికసంస్థల్లో రాజీవ్ గాంధీ మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తుంది. 2030కి ముందే కోటా అమల్లోకి తేవాలి. బిల్లు ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. కోటాలో ఎస్సి, ఎస్టి, ఓబిసి మహిళలకు సబ్ కోటా కల్పించాలి. చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి.” అని డిమాండ్ చేశారు.
- Advertisement -