Sunday, December 22, 2024

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సోనియా చేత రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆమె, ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపిగా ఉన్నారు.

ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయోద్దని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకే పెద్దల సభకు పోటీ చేశారు. ఇప్పటివరకు లోక్ సభకు ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ.. తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News