- Advertisement -
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకింది. సోనియా గాంధీకి జలుబుతో స్వల్పంగా జ్వరం ఉండడంతో కరోనా నిర్థారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం సోనియా హోంఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆమెతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8న ఆమె ఇడి ముందు హాజరుకావాల్సి ఉంది.
- Advertisement -