Monday, December 23, 2024

ముంబై ఇండియా కూటమి సమావేశాలకు హాజరు కానున్న సోనియా

- Advertisement -
- Advertisement -

ముంబై : ఈ వారం ఆఖరులో ముంబైలో జరగనున్న ‘ఇండియా’ (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలియన్స్) కూటమి సమావేశాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ మహారాష్ట్ర విభాగం అధ్యక్షులు నానా పటోల్ సోమవారం వెల్లడించారు. సబర్బన్ ముంబైలోని లగ్జరీ హోటల్‌లో ఈనెల 31, సెప్టెంబర్ 1న రెండు రోజుల పాటు ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ పాల్గొనే ఈ సమావేశాల్లో కూటమి అధికారిక లోగో ఆవిష్కరించడమౌతుందని పటోల్ సోమవారం విలేఖరులకు చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించిన వ్యూహాలపైన , అజెండా పైన ఈ సమావేశాల్లో చర్చిస్తారని చెప్పారు. ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జూన్‌లో జరిగింది. రెండో సమావేశం బెంగళూరులో జులైలో నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News