Thursday, December 19, 2024

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: సోనియాగాంధీ

- Advertisement -
- Advertisement -

ఆనాడు అధికారంలో ఉన్న తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగా తెలంగాణ ఏర్పాటు చేశామని
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. అనారోగ్య కారణాల కారణంగా సోనియాగాంధీ హాజరుకాలేక పోయారు. కాగా, ఆదివారం తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోనియా వీడియో సందేశాన్ని తెలంగాణ ప్రజలకు పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి ఆమె శ్రద్ధాంజలి పేర్కొన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించాని, తెలంగాణ ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందని ఆమె వీడియో సందేశంలో తెలిపారు. అమర వీరుల కలలను నెరవేర్చాలని ఆమె సూచించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కారు అమలు చేస్తుందని ఆశిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఎందరో అమరవీరుల త్యాగఫలం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి 2004లో కరీంనగర్ సభలో తెలంగాణ రాష్ట్రం ఇస్తానని హామీ ఇచ్చానని సొంత పార్టీలో అసమ్మతి ఏర్పడిన కొందరు నేతలు మా నిర్ణయాన్ని విభేదించి విడిపోయారని, అయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నామని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News