Friday, December 20, 2024

నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

Sonia Gandhi's health improving: Doctors

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని ఆమె చికిత్స పొందుతున్న సర్ గంగారాం ఆసుపత్రి వర్గాలు శనివారం తెలిపాయి. కొవిడ్ సోకిన అనంతరం శ్వాసకోశ సమస్యతో గత వారం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 75 ఏళ్ల సోనియా గాంధీకి కరోనా వైరస్ సోకినట్లు జూన్ 2న నిర్ధారణ కాగా ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత ఆదివారం(జూన్ 12) ఆమె ఆసుపత్రిలో చేరారు. 13వ తేదీన ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. సోనియా శ్వాసకోశలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ శుక్రవారం తెలిపారు. ఈ సమస్యతోపాటు కొవిడ్ అనంతర లక్షణాలకు ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.

Sonia Gandhi’s health improving: Doctors

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News