Friday, December 20, 2024

సోనియా గాంధీ పార్టీ మార్గనిర్దేశన చేస్తారు: అల్కా లంబా

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఇటీవల కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తన ఇన్నింగ్స్ ముగిశాయి అన్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి అల్కా లంబా ఆదివారం స్పందించారు. సోనియా గాంధీ రిటైర్ కాలేదు. ఆమె పార్టీకి తన మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తారన్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో అల్కా లంబా ప్రసంగిస్తూ ‘నేను మేడమ్ సోనియా గాంధీతో రెండు నిమిషాలు మాట్లాడాను. మేడమ్, మీరు నిన్న చేసిన వ్యాఖ్యలను మీరు రిటైర్‌మెంట్ తీసుకుంటున్నారన్న భావనను కలిగించింది. నేను సోనియాజీ తో మాట్లాడాను. ఆమె తన మార్గదర్శకత్వం, దీవెన కొనసాగిస్తారని హామీ ఇచ్చారు’ అన్నారు. సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్ కాబోవడం లేదని అల్కా లంబా స్పష్టం చేశారు.

రాయ్‌పర్‌లో శనివారం 85వ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ప్రసంగిస్తూ ‘ డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004 నుంచి 2009 వరకు మనము విజయాలు చూశాము. అది నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చింది. భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిశాయి’ అన్నారు. ఆ యాత్ర కాంగ్రెస్‌కు ఓ టర్నింగ్ పాయింట్ అన్నారు. భారత ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వం కోరుకుంటారని రుజువుచేశారన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచింది. ప్రజల కోసం పోరాడిందన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దేశ ప్రజలకు, నాయకులకు సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ప్రత్యేకంగా రాహుల్‌గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కృతనిశ్చయంతో, తన నాయకత్వంతో యాత్రను విజయవంతం చేశారు’ అని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News